Home / SLIDER / వాట్సప్ లో మెసేజ్ డిలిట్ చేసిన కూడా దాన్ని చదవచ్చు …

వాట్సప్ లో మెసేజ్ డిలిట్ చేసిన కూడా దాన్ని చదవచ్చు …

ఆధునిక టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో వాట్సప్ లో సరికొత్తగా మనం పంపిన మెసేజ్ ను ఎదుటివాళ్ళు చదవకుండానే డిలిట్ చేసే సదుపాయం వచ్చిన సంగతి తెల్సిందే .అయితే అలా పంపిన మెసేజ్ ను డిలిట్ చేసిన కానీ చదివే అవకాశం ఉంది అని తెలుస్తుంది .మొదట వాట్సప్ సంస్థ చెప్పినట్లుగా పంపేవారు ,రీసీవ్ చేసుకునేవారు ఇద్దరూ ఆ యాప్ ను అప్డేట్ చేసుకున్నవారై ఉండాలి .

అలా కాకుండా కేవలం ఒక్కరు మాత్రమే అప్ డేట్ చేసుకుంటే ఎటువంటి ఫలితం ఉండదని సదరు కంపెనీ హెచ్చరించింది .అయితే డిలిట్ చేసిన కానీ మరోవిధంగా మెసేజ్ రీసీవింగ్ నెటిజన్ పంపేవారి యొక్క సందేశాలను తెలుసుకునే అవకాశం ఉంది .అది ఎట్లా అంటే ముందుగా సదరు యూజర్ తమ గూగుల్ ప్లే స్టోర్ నుండి నోటిఫికేషన్ హిస్టరీ లాగ్ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి .

ఆ యాప్ మన ఫోన్లో ఉంటే వాట్సప్ లో మనకు పంపిన లేదా డిలిట్ చేసిన సందేశాలను చదవచ్చు ..చూడవచ్చు .ఇలా పంపించే మెసేజ్ లు నోటిఫికేషన్ రూపంలో అవతలి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాయి .అయితే ఇలా వచ్చిన ఒక్కొక్క మెసేజ్ లో తొలి వంద ఇంగ్లీష్ క్యారెక్టర్స్ నోటిఫికేషన్ హిస్టరీలో స్టోర్ అవుతాయి .కానీ ఆండ్రాయిడ్ 7.0 ఆ తర్వాత వచ్చిన లేటెస్ట్ అపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్ యూజర్లు మాత్రమే మీకు ఇతరులు పంపి డిలిట్ చేసిన సందేశాలను చూసుకోవచ్చు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat