తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలుపుకోవడంలో వైపల్యం చెందుతున్న తీరుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రగిలిపోతున్న సంగతి తెలిసిందే. కాపులను బీసీల్లో చేరుస్తానని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని అమలుచేయకుండా కాలయాపన చేస్తుండటమే కాకుండా…కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను గృహనిర్భందం చేసిన తీరుపై ఆ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇలా వేడిక్కిన వాతావరణం ఉండగా…ప్రభుత్వాన్ని ముద్రగడ మరోసారి హెచ్చరించారు.
కాపు రిజర్వేషన్ల అమలుకు డిసెంబర్ 6 డెడ్ లైన్ గా విధిస్తున్నట్టు చెప్పారు. ఇతర కులాలు అనుభవిస్తున్న 49 శాతంలో తమకు వాటా వద్దని, 51 శాతంలో మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని చెప్పారు. కాపు జాతి రోడ్డెక్కే పరిస్థితి తెచ్చింది సీఎం చంద్రబాబేనని పేర్కొన్న ముద్రగడ, రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. రిజర్వేషన్ ప్రకటించకుంటే కుటుంబసమేతంగా రోడ్డెక్కడానికి సిద్దంగావుండాలని కాపులకు ఆయన పిలుపునిచ్చారు.
కాగా, ఇటీల నిర్వహించిన కాపు వన సమారాధనలో ఆయన కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వాలు కాపులకు రిజర్వేషన్లు కల్పిప్తామని హామీ ఇచ్చి మాట తప్పుతున్నాయని ఆక్షేపించిన ముద్రగడ ప్రభుత్వం మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై తగు సూచనలు, సలహాలు అందించాలని కోరారు. డిసెంబర్ 6 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గడువిచ్చామని, ఈలోగా రిజర్వేషన్లపై చేయాల్సిన ఉద్యమం గూర్చి మంచి సూచనలు, సలహాలు అందజేయాలని కోరారు. అలాగే ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.
Post Views: 442