తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం లేఖను రాశారు.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనోభావాలను కించపరిచేవిధంగా తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాను తెలంగాణలో విడుదల కాకుండా నిలిపేయాలని కోరుతూ లేఖ రాసారు . రాణి పద్మావతి వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేవిధంగా ఈ సినిమాలో పాత్రను దర్శకుడు మలిచారని ఆరోపించారు. ఈ సినిమా ద్వారా కొందరి మనోభావాలు తీవ్రంగా గాయపడుతున్నాయన్నారు. ఈ సినిమాను విడుదల కాకుండా చూడాలని రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
