సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు సమ్మె విరమణ అయింది. కోర్టులో కేసులను ఉపసంహరించు కొని రేపటి నుండి విదుల్లోకి హాజరు కానున్నామని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాద్యాయుల సంఘం అద్యక్ష, ఉపాధ్యక్షులు యమ్.డి అనీషా, శ్రీవిష్ణు ప్రకటించారు. ఏడు డిమాండ్లతో ఈ నెల అరునుండి ఈ సంఘం సమ్మెకు దిగిన విషయం విదితమే.ఈ క్రమంలో వారు మంగళవారం రోజున ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పాతురి సుధాకర్ రెడ్డి ఆద్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డిని కలసి చర్చలు జరిపారు.
చర్చల అనంతరం సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ సమ్మె కాలాన్ని కూడ జీతంతో కూడిన పనిదినాలుగా గుర్తించినందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతతలు తేలిపారు. అంతే కాకుండ తామిచ్చిన డిమాండ్లకు అనుకూలంగా ప్రభుత్వం అంగీకరించినందున కోర్టులలో వేసిన కేసులను విరమించుకోనున్నట్లు వారు తెలిపారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించే ప్రక్రియ వేగవంతం చెయ్యడంతో పాటు విదుల్లో చేరిన రోజు నుండి క్రమబద్దీకరణ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి చర్చల్లో ప్రకటించారని వారు తెలిపారు. అంతే గాకుండా ఏప్రిల్ లో టెర్మినేషన్ లేకుండా 12 నెలల జీతం ఈ సంవత్సరంనుండి ఇవ్వనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారనివారు వెల్లడించారు.
చర్చల్లో మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు యస్.సి అభివృద్ది శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా, గురుకుల పాటశాలల కార్యదర్శి అర్.యస్ ప్రవీణ్ కుమార్, యస్.సి అభివృద్ది శాఖ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.కాగా చర్చల్లో పాల్గొన్నా సంఘం ప్రతినిధులు కిరణ్మయి, స్వప్న , శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Post Views: 172