Home / SLIDER / విద్యాశాఖ బ‌లోపేతానికి 2వేల కోట్లు..కొత్త ఉద్యోగాల భ‌ర్తీ.. డిప్యూటీ సీఎం క‌డియం

విద్యాశాఖ బ‌లోపేతానికి 2వేల కోట్లు..కొత్త ఉద్యోగాల భ‌ర్తీ.. డిప్యూటీ సీఎం క‌డియం

రాష్ట్రంలో విద్యారంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. గడచిన 40 నెలల్లో విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, ఫలితాలు, వచ్చే 20 నెలల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికల రూపకల్పనపై ఈరోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అన్ని విభాగాల అధికారులతో సమీక్ష చేశారు. విద్యార్థులే కేంద్రంగా, ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా… వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇష్టం వచ్చినప్పుడు కాలేజీలు, స్కూళ్లకు అనుమతులు, గుర్తింపులు తీసుకోవడం, ఇష్టం వచ్చినంత మందిని చేర్చుకుని తర్వాత పర్మిషన్ కు దరఖాస్తు చేసుకోవడం ఇక నుంచి నడవవని స్పష్టం చేశారు. ప్రైవేట్, కార్పోరేట్ ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అనుసరించాల్సిందేనని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశించినట్లు రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేసి అందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విద్యా శాఖ పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.
విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపుపై వీసీల కమిటీ వేశామని, కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కమిటీ నివేదికలో ఇప్పుడున్న వేతనాలను దాదాపుగా 70 శాతం పెంచడానికి ప్రతిపాదనలు చేశారన్నారు. అయితే దీనిని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆమోదించాలన్నారు. ఇక పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి అధికారాలు యూనివర్శిటీలకే ఇచ్చామన్నారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు నియామకాలుంటాయన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇందుకు కావల్సిన ఏర్పాట్లను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే సిద్ధం చేసిందన్నారు. విద్యాశాఖ సంక్షేమ, మౌలికవసతుల అభివృద్ధి సంస్థ, సర్వశిక్ష అభియాన్ సంస్థలు కలిసిపోయాయన్నారు. ప్రస్తుతం విద్యాశాఖలో వీటి ఆధ్వర్యంలో రెండువేల కోట్ల రూపాయల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పనులన్నీ వచ్చే ఏడాది జూన్ లోపు పూర్తి చేయాలని గడువు విధించామన్నారు. ప్రతి విద్యా సంస్థలో ఐటి సెల్ పెట్టాలని కూడా ఆదేశాలిచ్చామని తెలిపారు. విద్యా శాఖలో అన్నిస్థాయిల్లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ణానాన్నిపూర్తిస్థాయిలో వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat