తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన పరిణతిని కనబర్చారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై రాష్ట్ర స్థితప్రజ్ఞతతో స్పందించారు. వ్యక్తిగతంగా దూషించే వారు, పరుష పదాలు ఉపయోగించే వారి విషయంలో ఎలా వ్యవహరించాలనేది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
ఓ ఫేస్‌బుక్ పేజీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, మంత్రి కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన ఉదంతాన్ని రాజేశ్ పెండ్లిమడుగు అనే ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ…‘భావప్రకటన స్వేచ్ఛ సోదరా. వ్యక్తిగతంగా దురుసైన వ్యాఖ్యలు చేసే స్థాయికి చేరనంత వరకు విమర్శ చేయడంలో తప్పులేదు. మేం సరైన రీతిలో పనిచేశామా లేదా అనేది చివరగా అంతిమంగా నిర్ణయించేది ప్రజలే’ అని మంత్రి తెలిపారు. మంత్రి స్పందనను పలువురు ప్రశంసిస్తున్నారు. కువిమర్శకులకు చెంపపెట్టు వంటి స్పందన ఇచ్చారని కొందరు పేర్కొన్నారు.
Post Views: 409