వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలను నేరుగా చూడడంతో.. మంచి- చెడు, కష్టాలు- సుఖాలు అన్నీ కళ్ళారా చూస్తున్నారు. దీంతో సహజంగానే జగన్‌కి తెలియకుండానే మార్పు వచ్చిందని విశ్లేషకులు సైతం అబిప్రాయ పడుతున్నారు. జగన్‌లో వచ్చిన మార్పు ఎంత వరకు వెళ్ళిదంటే.. ఆయన ప్రజలకి కురిపిస్తున్న వరాల జల్లు చూస్తేనే అర్ధమవుతుంది.
అయితే జగన్ ఇస్తున్న వరాల జల్లుకు చాలామంది ఏమంటారంటే.. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో జగన్ ఈ వరాల జల్లును కురిపిస్తున్నాడని విమర్శిస్తున్నారు. మరి గత ఎన్నికల ప్రచారంలో జగన్ ఎందుకని వరాలు ఇవ్వలేదంటే.. రాష్ట్రం విడిపోయి ఆర్ధికంగా బాగా వెనుక బడిపోవడం.. దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టి ప్రజలను మోసం చేయాలని అనుకోక పోవడం.. కొంచెం అనుభవ రాహిత్యం… అనుభవరాహిత్యం ఎందుకన్నాం అంటే.. అప్పట్లోనే జగన్ జనంలోకి వెళ్ళినా ప్రజల్ని పూర్తిగా ఓన్ చేసుకోలేదు.. ప్రజల్ని ఓన్ చేసుకోవడం అంటే వారి సమస్యలను ఓన్ చేసుకోవండం.. ఆ విషయంలో జగన్ కి అనుభవం లేదు… ఎందుకంటే జగన్ పెరిగిన పరిస్థితులు వేరు కనుక.
ఇప్పుడు తాజా పాదయాత్రలో బాగంగా జగన్ ప్రజల్లోకి వెళ్ళడం కాదు.. ప్రజల సమస్యల్ని దగ్గరగా చూసిన జగన్‌లో వచ్చిన మార్పుకు నిదర్శనమే ఆ వరాల జల్లు. ఇక జగన్‌లో వచ్చిన ఇంకో మార్పు ఏంటంటే.. గతంలో ఎప్పుడు మైక్ పట్టుకున్నా నేనే సీయం అయితే అనే పదాలు ఎక్కువగా వాడే వారు.. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే అని అంటున్నారు. జగన్ ఎప్పుడైతే నేను నుండి మనం అయ్యారో అక్కడే చాలామందిని టచ్ చేశాడు. ఎంతలా అంటే టీడీపీ వర్గీయులు సైతం జగన్‌లో వచ్చిన మార్పు పై చర్చించుకుంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.
ఇక రాజకీయ విశ్లేషకుల్లో అయితే జగన్ ప్రసంగాలు, తొందరపాటు తనం వల్లనే తటస్థ ఓట్లను కోల్పోతున్నారనే అభిప్రాయం బలంగా ఉండేది. ఉదాహరణకి నంద్యాల ఉప ఎన్నికనే తీసుకుంటే.. చంద్రబాబు పై వ్యక్తిగత దాడికి దిగారు. చంద్రబాబును నడిరోడ్డుమీద కాల్చి చంపినా పాపం లేదన్నారు. ఉరి తీయాలన్నారు. సహజంగా ఈ మాటలు విన్న వారికి చంద్రబాబు అనుభవం, వయస్సు గుర్తొస్తుంది. అది ఖచ్చితంగా జగన్ కు మైనస్ తెచ్చిపెడుతుంది. నంద్యాల ఎన్నికల ఫలితమే అందుకు నిదర్శనమంటున్నారు.
అయితే పాదయాత్రలో భాగంగా రోజులుగా జగన్ చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగడం లేదు. పక్కా ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ మ్యానిఫేస్టోలో పెట్టిన హామీలను అమలుపర్చడం లేదని ఒక్కొక్కటిగా చెబుతున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణ మాఫీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలతోపాటు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తున్నారు. వివిధ సామాజికవర్గాలతో సమావేశమవుతున్నారు.
దీంతో పాదయాత్ర జగన్‌లో ఇంత మార్పు తెచ్చిందా.. అని వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే జగన్ దాదాపు 170 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. ఆయన ఈ యాత్రలో ఎన్నో అనుభవాలను చూస్తున్నారు. కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు. ప్రజల సమస్యలే తమ మ్యానిఫేస్టో అని చెబుతున్నారు. సామాన్యులతో మమేకమవుతున్నారు. చిన్న కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అందువల్లనే జగన్‌లో సంచలన మార్పు వచ్చిందని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. మొత్తం మీద జగన్‌లో వచ్చిన ఈ మార్పును చూసి వైసీపీ నేతలు లోలోన విపరీతంగా సంతోష పడుతున్నారని.. జగన్‌లో వచ్చిన ఆమార్పు వైసీపీకి చేసే మేలు అన్‌లిమిటెడ్ అని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఏపీ ప్రజలే అభిప్రాయ పడుతున్నారు.