తెలంగాణ అటవీశాఖపై కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ అధికారులు రోల్ మోడల్ అని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అటవీ అనుమతుల సాధనలో తెలంగాణ అటవీ శాఖ రికార్డు సృష్టించింది. కేవలం 9 నెలల 8 రోజుల్లోనే భారీ ప్రాజెక్టుకు అనుమతులు లభించాయి. దేశంలోనే ఇంత వేగంగా అనుమతులు రావడం ఇదే తొలిసారి.
టీమ్‌వర్క్, నిబద్ధతతో పని చేసి కేంద్రం, ఇతర రాష్ర్టాల అభినందనలను అటవీ శాఖ అధికారులు అందుకున్నారు.100 హెక్టార్ల అటవీ భూమి బదలాయింపు అనుమతులకు కనీసం 2 సంవత్సరాల సమయం పడుతుంది. కాని.. కాళేశ్వరం కోసం 3168 అటవీ భూముల బదలాయింపు జరిగింది. రేయింబవళ్లు అధికారులు, సిబ్బంది పనిచేశారు. మొదటి దశ అనుమతులు వచ్చిన నెల రోజుల్లోనే తుది అనుమతులు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఈ ప్రక్రియ ప్రారంభమయింది.