వచ్చే నెల (డిసెంబర్) 5న కొలువులకై కొట్లాట సభ నిర్వహిం చే అవకాశముందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు . సభను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం నల్లగొండలో నిర్వహించిన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఎలా భర్తీ చేస్తారు? అన్నది ప్రభుత్వం క్యాలెండర్ ద్వారా ప్రకటించాలన్నారు.తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువతను మోసం చేస్తూ ఇవ్వకపోవడంతోనే కొలువులకై కొట్లాట సభ నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు.
