తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను నటుడు సంపూర్ణేష్ బాబు కలిసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఇవాళ అయన కేసీఆర్ తో దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి ఏం రాశాడంటే..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, నా అభిమాన నాయకుడు, మా కేసీఆర్ గారిని కలవటం నా కల…ఆ కల ఇన్నేళ్ళకి సాకారం అయింది. Met our Jr.@KTRTRS too – sadhaa vaari premaki banisa pic.twitter.com/99NwmyC1KN
— Sampoornesh Babu (@sampoornesh) November 27, 2017
‘ తెలంగాణ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను. ఆయనను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ కల ఇన్నేళ్ళకు నెరవేరింది. మంత్రి కేటీఆర్ గారిని కూడా కలవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. వారి అమూల్యమైన ప్రేమకు సదా నేను బానిసను ’ అంటూ తన అభిమానాన్ని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అభిమాన హీరోకి అభిమాన నాయకుడు అని సంపూ ట్వీట్‌కు కామెంట్లతో ముంచెత్తుతున్నారు నెటిజనులు.