ప్రస్తుతం హీరో సుమంత్ మల్లి రావా అనే టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా లో సుమంత్ సరసన బద్రినాద్ కి దుల్హనియా నటి ఆకాంక్ష సింగ్ నటించింది.స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బేనర్ పై రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిత్ర కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ గౌతమ్ తిన్ననూరి అందించగా శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చాడు.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మెలోడి సాంగ్ విడుదల చేశారు. శ్రవన్, సునీత పాడిన ఈ పాట గుండెకు హత్తుకుపోయేలా ఉంది.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది.ఎంతగానో అలరిస్తున్న టైటిల్ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
