Home / SLIDER / జీఈఎస్ తో భారత్-అమెరికా బంధం బలోపేతం

జీఈఎస్ తో భారత్-అమెరికా బంధం బలోపేతం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కేవలం సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ ను అనుసంధానం చేసేది మాత్రమే కాదని, భారతదేశం-అమెరికా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడి అభిప్రాయపడ్డారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని, మేకిన్ ఇండియాలో, దేశ అభివృద్ధి కథలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. హెచ్‌ఐసీసీలో జీఈఎస్-2017 ను ఆయన ప్రారంభించి, ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.మహిళాభివృద్ధి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు ప్రధాని మోడి. జీఈఎస్‌లో 50 శాతానికి పైగా ప్రతినిధులు మహిళలే ఉండటం విశేషం అన్నారు.

మూడేళ్లలో కొత్త సంస్కరణలతో సరళతర వాణిజ్యంలో భారత్ స్థానం మెరుగుపడిందన్నారు. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ ర్యాంకింగ్స్ లో 100వ ర్యాంకుతో తాము సంతృప్తి చెందడం లేదని, 50వ ర్యాంకు లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.ఆవిష్కరణలకు, వ్యాపారవేత్తలకు ఇండియా ఇంక్యుబేటర్‌గా పని చేస్తుందని ప్రధాని మోడి చెప్పారు. దశాంశ మానము, సున్నా ఆవిష్కరణలు భారత మేధో శక్తికి నిదర్శనమని కొనియాడారు. నేటి డిజిటల్ యుగం మొత్తం సున్నా మీద ఆధారపడి ఉందన్నారు. పురాతన కాలం నుంచి మన వాణిజ్య పురోగతికి లోథాల్ నౌకాశ్రయం నిదర్శనమని చెప్పారు. మానవాళి జీవన ప్రమాణాల మెరుగుదలకు కొత్త ఆవిష్కరణలు చేసే శక్తి భారతీయులకు ఉందన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడమే స్టార్టప్ ఇండియా లక్ష్యమని ప్రధాని చెప్పారు.

స్టార్టప్ ఇండియా ద్వారా ఔత్సాహికులకు సహకారం అందించే సమగ్ర వ్యవస్థ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.భారత స్వాతంత్య్రోద్యమంలో ఎంతో మంది మహిళలు కీలకపాత్ర వహించారని ప్రధాని మోడీ గుర్తుచేశారు. భారత పురాణాల్లో దేవతలు శక్తికి ప్రతీకగా ఉంటారని చెప్పారు. అహల్యబాయి హోళ్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర నారీమణులు భారత మహిళా శక్తికి ప్రతీకలు అని కొనియాడారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ భారత మహిళా మేధోశక్తికి నిదర్శనమని తెలిపారు. అనేక పతకాలు తెచ్చి భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన సానియా మీర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధు పుట్టినిల్లు హైదరాబాద్ అని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat