ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకున్న మోదీ.. అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు.
‘సోదరి సోదర మణులారా.. మీ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హైదరాబాద్‌కు రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే నాకు సర్దార్ పటేల్ గుర్తు వస్తారు. హైదరాబాద్ సంస్థాన్ని భారతదేశంలో కలిపిన పటేల్‌కు ఈ వీర్‌భూమి నుంచి ప్రణామాలు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులకు జోహర్లు. హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరం. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది’ అని తెలుగులో మోదీ ప్రసంగించారు.