ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు స్టేషన్లలో జనం రద్దీ కొనసాగుతున్నది. మెట్రో రైలులో ప్రయాణించేందుకు హైదరాబాదీలు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఐతే.. కొన్ని విషయాలు తెలియక కొంత మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా గమనించాల్సిందే ఏమిటంటే.. నాగోల్ నుంచి డైరెక్ట్‌గా మియాపూర్‌కు ఒకే రైలు ఉండదు. నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ఒక ట్రైన్‌లో వెళ్లి అక్కడ ఇంకో రైలు ఎక్కాలి. టిక్కెట్ మియాపూర్ వరకు కొనుక్కున్నా సరే అమీర్‌పేటలో దాన్ని మార్చుకుని మియాపూర్ బండి ఎక్కాలి.
కొంత మంది ఈ విషయం తెలియక టెక్కట్టును మార్చుకోకుండా ఎక్కడం వల్ల మియాపూర్‌లో దిగినపుడు అక్కడ ఫైన్ కట్టాల్సి వస్తుంది. స్మార్ట్ కార్డు ఉన్నవాళ్లు సైతం ఇదే చేయాలి. అమీర్‌పేటలో దిగిన తరువాత మీయాపూర్ రైలు ఎక్కేటపుడు తమ స్మార్ట్ కార్డ్‌ను మళ్లీ స్వైప్ చేయాలి. లేదంటే ఫైన్ పడుతుంది. ఇలాంటి అనుభవం మొదటి రోజు కొంత మంది ప్రయాణికులకు ఎదురైంది.