తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలం బత్తులనగర్ లో 120 కుటుంబాలకు చెందిన న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల కార్యకర్తలు ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
