తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో అద్భుతంగా ప్రసంగించి.. చక్కని సమన్వయకర్తగా వ్యవహరించిన యువనాయకుడు, తెలంగాణ మంత్రి కే తారకరామారావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జీఈఎస్ వేదికపై ఆయన ప్రసంగం మంత్రముగ్ధుల్ని చేసిందని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ప్రశంసించారు. ‘ కేటీఆర్‌గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, నిన్న ప్రపంచ వ్యాపారసదస్సు (జీఈఎస్)లో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం’అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.
@KTRTRS గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, నిన్న #GES2017 ప్రపంచ వ్యాపారసదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం? pic.twitter.com/8D7SlNgkLk
— Paruchuri GK (@GkParuchuri) November 30, 2017
Thanks Sir ? https://t.co/B7u1FfkSNp
— KTR (@KTRTRS) November 30, 2017