Home / SLIDER / ప్ర‌తిప‌క్ష నేత‌ల్లో..త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తి ఎవ‌రో చెప్పిన మంత్రి కేటీఆర్‌

ప్ర‌తిప‌క్ష నేత‌ల్లో..త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తి ఎవ‌రో చెప్పిన మంత్రి కేటీఆర్‌

ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈశ్వరీబాయిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ఎమ్మెల్యే గీతారెడ్డితో కలిసి తిలకించారు. ఈశ్వరీబాయి మెమొరియల్ అవార్డ్-2017ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్‌కు మంత్రి కేటీఆర్ అందజేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు గీతారెడ్డికి చాలా రోజులుగా మంచి పరిచయం ఉంద‌న్నారు. తాను రాజకీయంగా చిన్నవాడిని అయినా ఏ రోజు కూడా సీనియర్ గా గీతారెడ్డి గారు మాట్లాడలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్ష నాయకులలో త‌నకు నచ్చే మనుషులల్లో గీతారెడ్డి గారు ఒకరని మంత్రి తెలిపారు..
నగరంలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌ను జరుపుకున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళ శక్తిని సమాజానికి ఉపయోగించుకునేలా జరిగింది..కానీ చాలా సంవత్సరాల క్రితం ఈశ్వరి భాయ్ సమాజంలో ఒక ఉన్నత వ్యక్తి గా మెలిగారని ప్ర‌శంసించారు. మహిళలు రాజకీయంగా ఎదిగి రావడం కష్టంగా ఉండే ఆ రోజులలో… ఈశ్వరి భాయ్ ఆనాడు వ్యక్తిత్వంతో గీతారెడ్డి గారిని తీర్చిదిద్దారని ప్ర‌శంసించారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడు, సాధించు అనే అంబేద్కర్ మాటలతో ఉద్యమంలో పాల్గొన్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.
శాసనసభ తీర్మానం ద్వారా తెలంగాణ వచ్చే అవకాశం లేని సమయంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే…స్వ‌రాష్ట్రం సిద్ధించింద‌ని అన్నారు. చిన్న రాష్టాలతో అభివృద్ది సాధ్యం అని అన్న మనిషి అంబేద్కర్ అని తెలిపారు. ఈశ్వ‌రీభాయ్ 1972లో సంపూర్ణ సాధన సమితిలో కీలక పాత్ర పోషించారని..తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశార‌ని తెలిపారు. స్వాతంత్ర్య‌ భావజాలం తో ముందుకు వెళ్తూ …తనలా గీతారెడ్డి ని తీర్చిదిద్దిన గొప్ప మనిషి ఈశ్వరి బాయ్ అని అన్నారు. తెలంగాణ తన కాళ్ల పై తాను ఉంది కాబట్టి ఈశ్వరి భాయ్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.
జి.వెంకట్ స్వామి, కొండ లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహరావు ఇంకా చాలా మంది జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక క‌ళాశాలకి ఈశ్వరి భాయ్ పేరు పెట్టడానికి సీఎం ముందుకు వచ్చారు…గీతారెడ్డి గారు చెప్పినా కాలేజ్ కి పేరు పెడుతామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈశ్వరి భాయ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ఉంచేలా కృషి చేస్తామ‌న్నారు. తెలంగాణ చరిత్ర ను గుర్తు చేసుకుంటున్నాం అంటే..తెలంగాణ రాష్టం ఏర్పడింది కాబట్టి అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat