గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగం, మోడరేటర్‌గా ఆయన చేసిన సమన్వయం…సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో పెద్ద ఎత్తున వీక్షించారు. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్, అమెరికా రాయభార కార్యాలయం, నీతి అయోగ్, మంత్రి కేటీఆర్, ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ఎప్పటికప్పుడూ తమ అప్‌డేట్లను పోస్ట్ చేయడంతో భారీ స్థాయిలో వీక్షకులు వాటికి స్పందించారు. #GES2017,#GlobalEntrepreneurshipSummit అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సాగిన ప్రచారం ఇటు ట్విట్టర్‌లో అటు ఫేస్‌బుక్‌లో జీఈఎస్ జరిగిన మూడు రోజుల పాటు వైరల్ అయింది.
మూడు రోజుల పాటు ఇటు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అటు నీతి అయోగ్ కీలక సెషన్లను యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో లైవ్ ఇచ్చారు. అయితే ఈ మూడు రోజుల వీడియోలలో మంత్రి కేటీఆర్ మోడరేటర్‌గా వ్యవహరించిన ప్లీనరీ సెషన్ ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో అత్యధిక వీక్షకులను కలిగి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ ప్యానలిస్ట్‌గా ఉండి మంత్రి కేటీఆర్ మోడరేటర్‌గా వ్యవహరించిన ‘వీ కెన్ డూ ఇట్!ఇన్నోవేషన్ ఇన్ వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ ఆండ్ స్కిల్స్ ట్రెయినింగ్’ సెషన్‌ను యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తన ఫేస్‌బుక్ పేజీలో అందించగా ఫేస్‌బుక్, యూట్యూబ్,వాట్సాప్‌లలో వైరల్ అయింది. యూట్యూబ్‌లో 46,27,673 మంది వీక్షించారు. ఫేస్‌బుక్‌లోని వివిధ పేజీల ద్వారా ఈ వీడియో చేరినవన్నీ కలుపుకొంటే దాదాపు 50 లక్షలు దాటింది.
జీఈఎస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్యానలిస్ట్‌లను పరిచయం చేస్తూ మంత్రి కేటీఆర్ చేసిన 6.29 నిమిషాల వీడియో వాట్సాప్‌లో విపరీతంగా షేర్ అయింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలోని సాంకేతికవర్గాల్లో ఈ వీడియో వైరల్ అయింది. బెంగళూరు, చెన్నై, పుణే, గుర్గావ్‌లో ఉన్న టెకీలు ఈ వీడియోలను పలు వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు. గత రెండు రోజులుగా కేటీఆర్ ప్రసంగం గురించి గూగుల్‌లో వెతికారని గూగుల్ ట్రెండ్స్ తెలిపింది. కేటీఆర్ స్పీచ్ ఎట్ జీఈఎస్, కేటీఆర్ స్పీచ్ ఇన్ జీఈఎస్ పేరుతో ఈ సెర్చ్ రెండు రోజుల పాటు గూగుల్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.
Post Views: 232