తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకి తలమానికం రాష్ట్రానికే రోల్ మోడల్ అయిన సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ కోమటి చెరువు ని మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం సందర్శించారు…ఈ సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించారు…
కోమటి చెరువు పై జరుగుతున్న పనుల జాప్యం పై మండిపడ్డారు…పనులు వేగవంతం చేసి డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలన్నారు…అదే విధంగా కోమటి చెరువు చుట్టూ ఉన్న ప్రహరీ కి సంస్కృతి ని ఉట్టిపడేలా పెంటింగ్స్ వేయాలన్నారు..కొత్త సంవత్సరానికి కోమటి చెరువును కొత్త హంగులతో ముస్తాబు చేసి పనులన్నీ పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులో కి తేవాలి అని టూరిజం అధికారులను ఆదేశించారు….కట్టపై ఉన్న చిన్న చిన్న పనులు పూర్తి చేయాలని…పలు పనులపై అధకారులకు మంత్రి హరీష్ రావు గారు సూచనలు సలహాలు ఇచ్చారు…
ఆడిటోరియం పనులు వేగవంతం కావాలి
సంస్కృతి ని ఉట్టి పడేలా…కళావైభవాన్ని ప్రతిబింబిచేలా సిద్దిపేట కె తలమానికంగా నిర్మిస్తున్న ఆడిటోరియం పనులను మంత్రి హరీష్ రావు గారు పరిశీలించారు…ఈ సందర్భంగా పనులు వేగవంతం చేసి…త్వరలో అందుబాటులో తీసుకరావలని మంత్రి కోరారు…జరుగుతున్న పనులు నాణ్యతతో చేయాలని…ఆడిటోరియం మన సంస్కృతి ని ఉట్టిపడేలా నిర్మించాలని..ఆడిటోరియం చుట్టూ మన కళావైభవాన్ని సంతరించుకొనే విధంగా పెంటింగ్స్ వేయాలి అని చెప్పారు…..