ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు. అభిమాన నేతతో కలిసి నడవాలని..కష్టాన్ని చెప్పుకోవాలని.. సంక్షేమ పథకాలు అందని తీరును వివరించాలని.. సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు భారీఎత్తున తరలివస్తున్నారు.ఈ క్రమంలో 24వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది.రేపు (శనివారం) ఆయన పత్తికొండ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. రతన, తుగ్గలి, గిరిగట్ల మీదగా మదనంతపురం క్రాస్ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.
మరోవైపు 23వ రోజు ప్రజాసంకల్పయాత్రను వైఎస్ జగన్ పత్తికొండలో ముగించారు. ఇవాళ ఆయన 15.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 330.6 కిలోమీటర్లు నడిచారు.