ఏపీ ప్రతికక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అచ్చం వైఎస్ పాదయాత్ర లాగానే సాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వృద్ధులను, రైతులను, డ్వాక్రా మహిళలతో కూర్చుని వారితో చర్చించడం అంతా ప్రతిరోజూ జరుగుతోంది. వైఎస్ మాదిరిగానే జగన్ వ్యవహరిస్తున్నారని పాదయాత్రలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అప్పట్లో వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడే పుట్టిన చిన్నారులకు నామకరణం చేశారు. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ అనేకమంది చిన్నారులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్లు పెట్టారు.
అయితే ఇప్పుడు సేమ్ టు సేమ్ జగన్ కూడా నాన్న బాటనేపట్టినట్లున్నారు. ఇటీవల ఒక బాలుడికి రాజశేఖర్ అని నామకరాణం చేశారు. తాజాగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన కూతురికి నామకరణం చేయాల్సిందిగా జగన్ పాదయాత్ర వద్దకు వచ్చి అభ్యర్థించారు. దీంతో జగన్ ఆ చిన్నారికి రేయాన్ష అని పేరుపెట్టారు. ఇది చూసిన క్యాడర్ వైఎస్ లాగానే జగన్ కూడా అందరితో కలుపుగోలుతనంగా వ్యవహరిస్తున్నారని.. నాడు రాజన్న.. నేడు జగనన్న అలా చేయడం ఇలాంటి గొప్పోళ్ళకే సాధ్యం అని వైసీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఇక మరోవైపు హామీలు కూడా జగన్ బాగానే గుప్పిస్తున్నారు. ఆయనను వెలుగు యానిమేమటర్లు కలిశారు. వారికి నెలకు పదివేల జీతం తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తానని హామీ ఇచ్చారు.