Home / ANDHRAPRADESH / ఏపీ ప్ర‌జ‌ల గురించి.. జ‌గ‌న్ గొప్ప‌గా చెప్పిన మాట‌లు ఇవే..!

ఏపీ ప్ర‌జ‌ల గురించి.. జ‌గ‌న్ గొప్ప‌గా చెప్పిన మాట‌లు ఇవే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌య‌త్రకి త‌న శ‌రీరం స‌హ‌క‌రించక పోయినా.. దిగ్విజ‌యంగా మొండిగా ముందుకు దూసుకుపోతున్నారు. ఒక వైపు పాద‌యాత్ర మ‌రోవైపు స‌భ‌లు.. ప్ర‌జ‌ల క‌ష్టాలు.. క‌న్నీళ్ళు.. ఆత్మీయ ప‌ల‌క‌రింపులు.. పేద‌వారి ఆతిధ్యాలు.. ఇలా చాలా జోరుగా సాగుతోంది. ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభిచి న‌ప్ప‌టి నుండి.. డైలీ త‌న‌కు ఎదురైన అనుభ‌వాల‌ను త‌న డైరీలో పొందు ప‌రుస్తున్నారు. అయితే ఇంత హ‌డావుడిలో కూడా జ‌గ‌న్ తాజ‌గా ఒక ఇంట్యూర్యూ ఇచ్చారు.

జ‌గ‌న్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అనేక ఆశ‌క్తిక అంశాల గురించి ప్ర‌స్తావించినా.. ఏపీ ప్ర‌జ‌ల గురించి చెప్పిన ఒక మాట సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. జ‌గ‌న్ ఏపీ ప్ర‌జ‌ల గురించి చెబుతూ.. ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌రాష్ట్రం ఎప్పుడూ వ‌న్ సైడ్ తీర్పు ఇస్తోంద‌ని.. 1999 ఎన్నిక‌లు చూస్తే… అప్పుడు చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా.. వైఎస్ ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు.. తూర్పుగోదావ‌రిలో చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చింది ఒక సీటు.. జ‌క్కం పూడి రామ్‌మోహ‌న్ రావు గారు గెలిచారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కూడా జి ఎస్ రావుగారు ఒక్క‌రే గెలిచారని.. అయితే అదే రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌బాబు.. 2004 ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి తూ.గో.జీలో 21కి 19 స్థానాలు గెల్చుకోగా.. టీడీపీ 2 స్థానాలు గెల్చుకుంది. ప‌.గో.జీలో 16 స్థానాల‌కు గానూ 12 స్థానాలు కాంగ్రెస్‌కి టీడీపీకి 4 స్థానాలు వ‌చ్చాయి. ఏపీ మొత్తం 294 నియోజ‌క వ‌ర్గాలకు గానూ.. చంద్ర‌బాబుకు 15 శాతం కూడా ఓట్లు ప‌డ‌లేదు.. అంటే ఏపీ ప్ర‌జ‌లు ఎప్పుడైనా ఒకే పార్టీకి గుద్దుతారు.. వ‌చ్చే సార్వ‌త్రికి ఎన్నిక‌ల్లో సేమ్ సీన్ రిపీట్ అవుతోంద‌ని చెప్పారు.
ఎందుకంటే.. చంద్ర‌బాబుకి చాట్టం లేదు.. న్యాయం లేదు.. అవినీతి చేసి ప‌ట్టుబ‌డి కూడా చ‌ల‌నం లేని వ్య‌క్తి.. అన్ని రాకాలుగా మోసాలు అవినీతి చేశార‌ని ప్ర‌జ‌ల‌కి బాగా అర్ధ‌మైందని.. వారు చేస్తున్న మోసాలు.. అవినీతి.. రౌడీయిజంతో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల నుండి ఊహించ‌ని దెబ్బ ప‌డుతోంద‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat