Home / SLIDER / తెలంగాణ ఇంటర్ బోర్డు దేశంలో మొదటి స్థానంలో ఉండాలి..కడియం

తెలంగాణ ఇంటర్ బోర్డు దేశంలో మొదటి స్థానంలో ఉండాలి..కడియం

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇంటర్ కాలేజీలకు కావల్సిన వసతులు కల్పిస్తున్నామని, కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు పెంచామని, ప్రభుత్వ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం చేయాల్సినవన్ని చేస్తున్నందున లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు కలిసి ఉత్తమ ఫలితాలు సాధించి చూపాలన్నారు. ఆర్టీసి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ప్రిన్సిపాళ్ల వర్క్ షాప్ లో ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
ఇంటర్మీడియట్ లో గత రెండేళ్లుగా కొత్త భవనాలు,అదనపు క్లాసులు, ఫర్నిచర్, సీసీ కెమెరాలు, బయో –మెట్రిక్ మెషీన్లు, ల్యాబ్ మెటీరియల్, గేమ్స్-స్పోర్ట్స్ సామాగ్రి, ఆర్వో ప్లాంట్, కంప్యూటర్ సిస్టమ్స్ వంటి వసతుల కోసం 275 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వీటితో పాటు లెక్చరర్ల వేతనాల కోసం 160 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు.

Image may contain: 2 people, people sitting

లెక్చరర్లకు పదోన్నతులు కల్పించామని, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడానికి జీవో 16 తీసుకొచ్చామని చెప్పారు. అయితే కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ పై కొంతమంది కోర్టుకు వెళ్లి జీవోను కొట్టి వేయించడం వల్ల ఆ ప్రక్రియ ఆగిపోవడంతో వారి వేతనాలను డబుల్ చేశామన్నారు. దీనివల్ల ప్రస్తుతం కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు 37వేలకు పెరిగాయన్నారు. ప్రభుత్వం తరపున ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు లెక్చరర్లు బాగా పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించి చూపాలన్నారు. ఈ ఫలితాలు చూసి వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన విద్యార్థులంతా ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు రావాలన్నారు. విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కృషి చేయాలన్నారు. ప్రస్తుతం 1, 75,000 నుంచి 1,80,000 వరకు విద్యార్థుల నమోదు ఉందని, వచ్చే ఏడాది ఇది రెండు లక్షలకు దాటాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ కాలేజీలకు నిర్వహణ గ్రాంట్ కింద కాలేజీకి లక్ష రూపాయలను ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఈ గ్రాంటు వల్ల ప్రభుత్వం మీద ఏటా నాలుగు కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కాలేజీలు ప్రారంభమయ్యే నాటికి ఈ గ్రాంటు కాలేజీలకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఎంసెట్, నీట్, జే.ఈ.ఈ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడానికి వచ్చే వేసవి సెలవుల్లో పూర్వ 10 జిల్లా కేంద్రాల్లో బాలికలకు ఒకటి, బాలురకు ఒకటి చొప్పున 20 కేంద్రాలను ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ కోచింగ్ సెంటర్లకు కావల్సిన వసతులు, కోచింగ్ తీసుకునే విద్యార్థులకు భోజన వసతులు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని, వారికి శిక్షణ ఇచ్చేందుకు 20 సెంటర్లకు, 20 మంది నెలకొకరు చొప్పున ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
గ్రామీణ విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించేందుకు, ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన వసతి కోసం సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.మరో 75 రోజుల్లో పరీక్షలు ఉన్నందున లెక్చరర్లు ఎక్కువ సమయాన్ని కాలేజీల్లో విద్యార్థులకు కేటాయించాలన్నారు. ఉత్తమ ఫలితాలు వచ్చేలా పనిచేయాలన్నారు.

Image may contain: 19 people, people sitting, crowd and indoor

ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల ఇంటర్ విద్య పటిష్టమైందని, డిప్యూటీ సిఎం గైడెన్స్ లో బోర్డులో అనేక సంస్కరణలు వచ్చాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ అన్నారు. ప్రస్తుతం పదికోట్ల రూపాయలతో ఇంటర్ అన్ని కాలేజీల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అమలు చేయనున్నామన్నారు. బోర్డులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, దీనివల్ల ఆన్ లైన్ సేవల్లో సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఏటా పదిశాతం విద్యార్థుల నమోదు తగ్గుతూ దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరి బాధ్యతలు చేపట్టి నేడు వాటిని పటిష్టం చేశారని ఇంటర్ జేఏసీ చైర్మన్ మధు సూధన్ అన్నారు. ఇంకో 20 ఏళ్ల వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల గురించి ఆలోచించాల్సిన పనిలేకుండా చేశారన్నారు.

ఉచిత విద్యను ఇంటర్ లో పెట్టి, నమోదు పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టి, కాలేజీలను పటిష్టం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు ఇంటర్ కాలేజీలున్నంత కాలం ఉంటుందని కొనియాడారు. ఉచిత విద్య అందిస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా కల్పిస్తే చాలా మేలు చేసినట్లు ఉంటుందని కోరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు నర్సిరెడ్డి మాట్లాడుతూ…వచ్చే ఏడాది ఇంటర్ అడ్మిషన్లను రెట్టింపు చేయాలని ప్రిన్సిపాళ్లను కోరారు. పిల్లల నుంచి వసూలు చేస్తున్న 450 రూపాయల పరీక్ష ఫీజును రియంబర్స్ చేసే విధంగా చూడాలని కోరారు. విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తే విద్యార్థుల హాజరు మరింత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన వాళ్లు, కొత్త, కొత్త ప్రొగ్రామ్స్ చేపట్టి విద్యార్థుల ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్న ప్రిన్సిపాళ్లు తమ అనుభవాలను వేదిక మీదకు వచ్చి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat