“మా దగ్గర మీకు నచ్చిన నగని ఎంచుకోండి, ఫోటో కూడా తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. అలాగే నాలుగైదు షాపుల్లో రేట్ ని కంపేర్ చేసుకోండి, మీకు ఎక్కడ ధర తక్కువ అనిపిస్తే అక్కడే తీసుకోండి. డబ్బులు ఊరికినే రావు” అంటూ రోజు ఎక్కడో ఒకచోట మనకు కనిపించే లలితా జ్యూవెలరీ అధినేత కిరణ్ కుమార్ షాప్ లో దొంగలు పడ్డారు.ఇవాళ సాయంత్రం బురఖా ధరించి వచ్చిన ఇద్దరు మహిళలు ఈ చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. 6 లక్షల విలువైన హారాన్ని దొంగిలించి… దాని స్థానంలో రోల్డ్ గోల్డ్ హారం ఉంచి పరారయ్యారు. ఈ తతంగం అంతా షాపులోని సీసీ కెమెరాలో రికార్డైంది. సీసీ ఫుటేజీ పరిశీలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షాపు అధికారులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
