తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్ నందిని సిధారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు..ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.ప్రపంచ తెలుగు మహాసభలకు ఇతర దేశాలనుండి 500 మంచి హాజరవుతారని అన్నారు .ఇతర రాష్ట్రాలనుండి దాదాపు 1500మంది..స్థానికంగా 6 వేల మంది హాజరావుతారన్నారు . ఎల్బీ స్టేడియంలో 8 ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు .ఎనిమిది ద్వారాలకు 8 మంది కవుల పేర్లు పెడతామన్నారు . స్టేడియం లోపల పురావస్తు ప్రదర్శన శాల, పుస్తకాల ప్రదర్శన తదితర 8 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టేడియం బయట తెలంగాణ వంటలకు సంబంధించి 50 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.రోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 వరకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మూడ్రోజులు 2 గంటల పాటు సాహిత్య సదస్సులు నిర్వహిస్తామన్నారు.
