వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 32వ రోజు షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శనివారం విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
