తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత ,ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా గాంధీభవన్లో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీ నాలుగు ఏండ్లు ఏమి చేయలేదు .అంత కాంగ్రెస్ పార్టీనే చేసింది .దేశానికి స్వాతంత్రం తెచ్చింది .తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది .నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టింది అని ఇలా కాంగ్రెస్ చేసిన పనులను ఆయన ఏకరువు పెట్టారు .వీటిపై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పందించారు .మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ పునరేకీకరణ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆయన అంటున్నారు .అసలు ఎవరి పునరేకీకరణ కోసం ఆయన పార్టీ మారారు .అధికారం తప్ప కాంగ్రెస్ పార్టీకి మరో యావ లేదు .అసలు సిద్ధాంతాలు ,నియమాలు లేవు .ఒకప్పుడు సోనియా గాంధీని రాక్షసిగా పోల్చిన రేవంత్ ఆమెను నేడు దేవత అమ్మగా పోల్చడం రేవంత్ నీచరాజకీయలకు నిదర్శనం అని ఆయన అన్నారు .
