తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నాగార్జున సాగర్ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటిని మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి విడుదల చేశారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ ..యాసంగి కోసమే నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
సాగర్ నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వటమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు.2018 ఏప్రిల్ 5 నాటికి చివరి విడత నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో సాగర్ ఆధునికీకరణ పనులు 30 శాతమే జరిగాయని.. తాము మూడేండ్లలోనే 65 శాతం సాగర్ ఆధునికీకరణ పనులు చేశామని హరీశ్ రావు గుర్తు చేశారు. సాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ కోసం రూ. 1265 కోట్లు వెచ్చించామని మంత్రి వెల్లడించారు.
2018 జూన్ నాటికి వంద శాతం పనులు పూర్తి చేసామని హామీ ఇచ్చారు.సాగునీటి పారుదల శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారన్నరు … సాగర్ పనుల తీరుపై ప్రపంచ బ్యాంకు మనల్ని అభినందించిందన్నారు. అధికారులంతా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి చెప్పారు.కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు. కోర్టుల్లో కేసులతో అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు