గొల్ల కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నాలుగు నెలల్లో 31 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి పర్యటించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గందమల్ల బస్వపురం రిజర్వాయర్ పనులు పూర్తయితే యాదాద్రి భువనగిరి జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ అభివృద్ధిని చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కళ్లు లేవని, తాడు బొంగరం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.రాష్ట్రంలో లక్షా 14 వేల ఉద్యోగాలకు గాను ఇప్పటి వరకు 38 వేల ఉద్యోగాల నియామకం పూర్తి అయిందన్నారు.
