తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ అవార్డుకు మంత్రి కేటీఆర్ ఎంపికయ్యారు. ఆయనను బిజినెస్ వరల్డ్ “లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు” వరించింది. ఉత్తమ పట్టణ మౌలిక వసతులున్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, పట్టణాల్లో హరితహారం, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం వంటి అంశాలను ఈ సంస్థ పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ నెల 20న ఢిల్లీలో ఈ అవార్డులను సంస్థ ప్రదానం చేయనున్నది.
