రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగింది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కీలక అంశాలకు చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ,మంత్రి సురేష్ ,నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలో బిజినస్ వరల్డ్ 5వ స్మార్ట్ సిటీల సదస్సు,అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి,ఎంపీ కవిత, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు తేజవత్,కర్ణాటక రోడ్డు రవాణా శాఖ మంత్రితో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న రాష్టాలలో తెలంగాణ ఒకటని తెలిపారు. మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి, ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెట్టటానికి వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులు రావాలంటే ఆర్థిక శాఖ సరళీకృత చేయాల్సిందిగా అరుణ్ జైట్లీకి వివరించానని తెలిపారు. తాము లేవనెత్తిన అంశాలను అరుణ్ జైట్లీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో తెలంగాణలో నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్ ను ఏర్పాటు చేయాలని కోరామని వివరించారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరాము మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి కేటీఆర్ వివరించారు.
నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్‌ను కలిసిన సందర్భంగా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సుకు సహకరించినదుకు ధన్యవాదాలు తెలిపానని మంత్రి కేటీఆర్ వివరించారు. జీఈఎస్ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను అమలు పర్చాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.