వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నేడు.. ఈ సందర్బంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా నల్లమడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. భారీ కేక్ కట్ తెప్పించి వైఎస్ జగన్ చేత కట్ చేయించారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు…. ఆయన సూచించారు. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ఈ సారి ప్రజలతో కలిసి, ప్రజల మధ్య నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవడం విశేషం.
