ఏపీ టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) వాయిదా పడింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సమయం తక్కువగా ఉందన్న విద్యార్థుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇవాళ ఆయన మీడియాకు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 17 నుంచి 27 వరకు ఆన్లైన్లో ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. మరో మూడు వారాలపాటు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల జారీ తేదీల్లో మార్పులు ఉంటాయని మంత్రి గంటా తెలిపారు.టెట్ వాయిదా ప్రభావం డీఎస్సీ నిర్వహణపై ఉండదని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష రద్దు చేస్తారంటూ వస్తోన్న వదంతుల్ని అభ్యర్థులెవరూ నమ్మొద్దని ఆయన సూచించారు
