కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం నిండు సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు .దాయాది దేశమైన పాకిస్తాన్ లో కుల భూషణ్ జాదవ్ ,అతడి కుటుంబ సభ్యుల భేటీ పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరుపై సుష్మా లోక్ సభలో ప్రకటన చేశారు .ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ పాక్ అమానవీయ తీరును ఉటంకిస్తూ ఒకింత ఆమె ఉద్వేగానికి గురయ్యారు .
దీంతో సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు .అంతే కాకుండా ఆ సమయంలో భారత డిప్యూటీ కమిషనర్ ను కూడా భేటీకి నేరుగా అనుమతించలేదు అని ఆమె తెలిపారు .ఆ సమయంలో జాదవ్ భార్య ,తల్లి దుస్తులను మారిపించిన విషయం కూడా డిప్యూటీ కమీషనర్ కు తెలియదు అన్నారు .అంతేకాకుండా జాదవ్ కుటుంబ సభ్యులతో మీడియా మాట్లాడకూడదు అని ఇరు దేశాలు ముందే ఒప్పందం చేసుకున్నాయి అని ఆమె తెలిపారు .ఆ విషయాన్నీ పాకిస్తాన్ విస్మరించింది అని అన్నారు .మీడియాకు అనుమతి ఇవ్వడంతోనే వారు జాదవ్ కుటుంబ సభ్యులను వేధించారు అని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు .