సంక్షేమ రంగంలో తెలంగాణ దుసుకపోతుంది.అన్ని వర్గాలకు అభివ్రద్ది ఫలాలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.దేశంలోనే ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణి , చేపల పంపిణిలాంటి కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల, కురుమల భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు .దీని కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కోకాపేట్ లో పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు.ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గొల్ల, కురుమల సంక్షేమ భవనాల శంకుస్థాపన చేయనున్నారు.శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు .
