పార్టీలకతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే.. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి, కరీంనగర్ నుంచి మానేరు వరకు 4 లేన్ల రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీ రుణం తీర్చుకుంటున్నారని అన్నారు.
మూడేళ్లలోనే 3 వేల కిలోమీటర్ల జాతీయ రహదార్లకు అనుమతి తీసుకువచ్చామని తెలిపారు. ఇతర రాష్ర్టాల సీఎంలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను పరిశీలిస్తున్నారని చెప్పారు. దేశంలోనే రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు.రూ.లక్షా 60 వేల బడ్జెట్ ప్రవేశాపెడుతుంటే ప్రతిపక్షాలు నోరేల్లబెడుతున్నాయని అన్నారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.