తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018 సంవత్సరంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
