ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత యాబై ఒక్కటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ఎనిమిది వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.
జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీనియర్ మంత్రి తనయుడు ఒకరు జగన్ పాదయాత్రలో భాగంగా వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్లు జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.జిల్లాకు చెందిన అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సీనియర్ మంత్రి తనయుడు త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జిల్లాకు చెందిన కింది స్థాయి నేతల దగ్గర నుండి నియోజక వర్గాల ఇంచార్జ్ ల వరకు భారీ మొత్తంలో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు .
జిల్లా రాజకీయాల్లో పెనుసంచలనం అని ఇటు వైసీపీ అటు అధికార టీడీపీ పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని ఎంతోగానో కష్టపడుతున్న ఆ పార్టీ శ్రేణులకు ఈ జిల్లా నుండే పునాది పడొచ్చు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.