ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని తన మంత్రి వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇబ్బందుల్లో పెట్టె సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు .గత కొంతకాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరతారు .లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు .
లేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో చేరతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి .అయితే తనపై వస్తున్న వార్తలపై మంత్రి గంటా స్పందించారు .ఆయన్ని మీడియా ప్రతినిధులు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటి చేస్తారు అని ప్రశ్నించారు .దీనికి సమాధానంగా మంత్రి గంటా మాట్లాడుతూ ఎక్కడ నుండి పోటి చేస్తే తప్పు ఏముంది .
అసలు తానూ చోడవరం నుండి పోటి చేస్తే తప్పు ఏముంది .అయిన చంద్రబాబు నాయుడు ఎక్కడ నుండి పోటి చేయాలనీ అదేశిస్తే అక్కడ నుండి పోటి చేస్తాను .అయిన అధికార టీడీపీ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు తనపై ఇలా విషప్రచారం చేస్తున్నారు .అయితే సార్వత్రిక ఎన్నికల్లో చోడవరం నుండి పోటి చేయకపోయిన కానీ భీమిలి నుండే పోటి చేస్తాను అని ఆయన క్లారీటీ ఇచ్చారు . అయితే ప్రముఖ నేతలు తనను ఇబ్బంది పెడుతున్నారు అని చేస్తున్న వ్యాఖ్యల వెనక టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఉన్నాడు ..అయ్యన్న పాత్రుడు వలన పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పనున్నట్లు అని మంత్రి గంటా సంకేతాలు ఇచ్చాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు .