ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ నిమ్మకాయల చిన్నరాజప్పకు భారీ ప్రమాదం తప్పింది.ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కోసం విశాఖపట్నం నుంచి నర్సీ పట్నం వెళ్ళుతున్న క్రమంలో తన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనంలోని ఒక వాహనం దగ్ధమైంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై డిప్యూటీ సీఎం కారును అపడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే దగ్గదమైన కారులో ఎవరైనా ఉన్నారా..? కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
