ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కష్టాలు మొదలయ్యాయా ..?.ఇప్పటికే రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొనసాగిస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకోవడమే కాకుండా మరోవైపు గత యాబై ఎనిమిది రోజులుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తోన్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అధికారం దక్కడం కష్టమే అని బాబు భావిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తన అనుచరులతో కలిసి వైసీపీ లోకి చేరారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ,శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా తనకు మంత్రి పదవీ ఇవ్వకపోవడమే కాకుండా గత మూడు దశాబ్దాలుగా పార్టీను అంటిపెట్టుకున్న వారిని పక్కన పెట్టి మరి వైసీపీ నుండి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో బొజ్జల పార్టీకి ,అధికారక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు .
అందులో భాగంగా గత వారం రోజులుగా జరుగుతున్న జన్మభూమి కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉండటం కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది.ఈ క్రమంలో ఆయన తన రాజకీయ భవిష్యత్తు గురించి ,తనయుడు సుధీర్ రెడ్డి గురించి ఆలోచించిన బొజ్జల సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్లు బొజ్జల అనుచరవర్గం అంటున్నారు .ఈ క్రమంలో రానున్న కాలంలో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని ..అందుకు జిల్లా వైసీపీ నేతలతో చర్చలు కూడా జరిపినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.చూడాలి మరి బొజ్జల సైకిల్ మీద ప్రయాణం చేస్తారో ..ఫ్యాన్ కిందకు వస్తారో ..?