వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 58 వ రోజుకు చేరుకుంది ఈ క్రమంలో 58 వ రోజుకు సంబంధించిన పాదయాత్ర షెడ్యూల్ విడుదలయింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని చిప్పరపల్లెలో ఉదయం జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం పైన జీతివానిఒడ్డులో స్వాగతం పలుకుతారు. తర్వాత కింద జీతివాని ఒడ్డు నుంచి జక్కిదోన, గంటవారిపల్లె, బొట్లవారిపల్లె మీదుగా జగన్ పాదయాత్ర సాగిస్తారు. బొట్లవారి పల్లెలో మధ్యాహ్నం 1 గంట 15 నిముషాలకు భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ఎదురుకుప్పం చేరుకుంటారు. ఆరున్నరకు అక్కడే రాత్రి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని బస చేస్తారు .
