కొత్త సంవత్సరం లో ( ఆంగ్ల సంవత్సరం ) మొదటగా వచ్చేది సంక్రాంతి పండుగ .తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.మన సంస్కృతికి , సంప్రదాయాలకు ఈ పండుగా అద్దం పడుతుంది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి.చిన్న రేగి పండ్లు ,శేనిగాలు చిల్లర డబ్బులు ,పులా రేకులు కలిపి బోగి పండ్లు పోస్తుంటారు.ముచ్చటగా మూడుసార్లు దిష్టి తీ సినట్టుగా పిల్లల తలపై నుంచి తిప్పి ఈ బోగి పన్లు పోస్తుంటారు.
ఈ విధంగా చేయడం ఆచారం వెనుక పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అర్ధం లేకపోలేదు.రేగి చెట్టుకి బదరి వృక్షం అనే పేరు వుంది .బదరి కేత్ర వాసుడైన శ్రీ మాన్ నారాయనుకి రేగి పండ్లంటే ఎంతో ఇష్టం .అలాంటి రేగి పండ్లును పిల్లల తలపై పోయడం వలన శ్రీ మహా విష్ణువు అనుగ్రహం వాళ్ళకి లబిస్తుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు .ఇక రేగు పండ్లలో ఎన్నో ఔషధమైన గుణాలున్నాయి .రేగి పండ్లను తలపై నుండి పోయడం వలన అవి శరీరం అంతా తాకుతూ కింద పడతాయికనుక చర్మ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి .
ఇక రేగు పండ్లు తినడం వలన రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.మాసికపరమైన ఒత్తిడి తగ్గుతుంది .రేగిపండ్లు వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాకుండా ఆకలిని ఆరోగ్యాని పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది .రేగుపండ్లు పచ్చళ్ళు ,ఒడియాలు పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఇదే.చూడటానికి సరదాగా, సంతోషంగా అనిపించే బోగి పండ్ల వేడుక వెనుక ఇంత రహస్యం దాగి వుంది.