Home / SLIDER / కేంద్ర జ‌ల‌సంఘం ప్ర‌తినిధులు ప్ర‌శంస‌లు..!

కేంద్ర జ‌ల‌సంఘం ప్ర‌తినిధులు ప్ర‌శంస‌లు..!

కాళేశ్వరం పనులపై కేంద్ర జల సంఘం ప్ర‌తినిధులు ప్ర‌శంస‌లు కురిపంచారు. ప్రాజెక్టు ప‌నితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే  విభిన్నమైనదని కేంద్ర జలసంఘం ప్రతినిధుల బృందం వ్యాఖ్యానించింది. రెండు రోజులపాటు కాళేశ్వరం పనులు పరిశీలించిన ఈ బృందం సభ్యులు బుధవారం నాడు జలసౌధలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర జలసంఘం డైరెక్టర్లు ముఖర్జీ, రాజీవ్ కుమార్, కాళేశ్వరం సి.ఈ.లు ఎన్.వెకటేశ్వర్లు, హరి రామ్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అన్నీ విధాలా  `ప్రత్యేకమైనది` గా బృందం వ్యాఖ్యానించింది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు సమీకృత,బహుళార్ధసాధక ప్రాజెక్టు అని కేంద్ర జల సంఘం ప్రాజెక్టుల అప్రైజల్ విభాగం  చీఫ్ ఇంజనీర్ సి.కె.ఎల్.దాస్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, 18 లక్షల  ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం తో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు అని ఆయన ప్రశంసించారు. మిడ్ మానేరు, ఎస్.ఆర్.ఎస్.పి సహా పలు ప్రాజెక్టులకు కాళేశ్వరం ఆధారం కాబోతున్నదని చెప్పారు. ఇలా ఒక భారీ ప్రాజెక్టు మరికొన్ని సాగునీటి ప్రాజెక్టులతోఅనుసంధానం చేస్తున్న ప్రక్రియ తెలంగాణలోనే కనిపిస్తున్నట్టు దాస్ అభిప్రాయపడ్డారు. స్ట్రక్చర్ల  నిర్మాణాలు, ప్రణాళిక, పనులవేగం,పనులు జరుగుతున్నతీరు తమను ఆకట్టుకున్నాయని అన్నారు. రేయింబవళ్లు మూడు షిఫ్టులలో భారీగా జరుగుతున్న  పనుల వేగాన్ని బట్టి వచ్చీ వానాకాలం నాటికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మైలు రాయి దాటుతుందని సి.డబ్ల్యూ.సి. బృంద సారధి దాస్ అభిప్రాయపడ్డారు..ఈ తరహా వేగవంతమైన పనులు ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. జూన్ లో ప్రాజెక్టు ద్వారా తొలి  ఫలితాన్ని  అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా  పెట్టుకున్నదని, టైమ్ ఫ్రేమ్ ప్రకారం పనులు జరిగితే అనుకున్న గడువులోపే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రాజెక్ట్ వ్యయం పెరగకుండా పనులు పూర్తి కావాలన్నారు .అందుకు ప్రతి ఒక్కరూ అన్నీ శాఖలూ కలిసి కట్టుగా పనిచేయాలని దాస్ కోరారు. పనులలో వేగం మరింత పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకుందని చెప్పారు.

మేడిగడ్డ వద్ద నీటి లభ్యతకు ఎలాంటి సమస్య లేదని కేంద్ర జలసంఘం హైడ్రాలజీ డైరెక్టర్ నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణ పనులు చాలా సంతృప్తికరంగా జరుగుతున్నాయని, దేశంలోనే గొప్ప ప్రాజక్ట్ గా కాళేశ్వరం నిర్మాణం అవుతున్నట్టు రాయ్ వ్యాఖ్యానించారు. జాతీయ అభివృద్ధిలో కాళేశ్వరం భాగస్వామి అవుతుందని సి.డబ్ల్యూ.సి.సి.ఈ. దాస్ అన్నారు.ఇదొక మెగా ప్రాజెక్టు అని కొనియాడారు. కోట్లాది మండి రైతుల ప్రయోజనాలతోపాటు బహుళ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఈ ప్రాజెక్టు ఒక అద్భుతమని అన్నారు. తమ ప్రభుత్వం కాళేశ్వరంను నిర్ణీత గడువు లోగా పూర్తయ్యేలా ప్రణాళికా బద్దంగా పని చేస్తున్నట్టు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఈ ప్రాజెక్టు పనులను నిరంతరం సమీక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్ణీత గడువు లోపే ప్రాజెక్టును  పూర్తి చేసి రికార్డును నెలకొల్పనున్నట్టు స్పెషల్ సి.ఎస్. చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat