కేంద్ర పరిశ్రమల శాకా మంత్రి సురేష్ ప్రభుతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి నిమ్జ్ స్టేటస్ ఇవ్వాలని కోరారు. ఫార్మా సిటీ అభివృద్ధికి 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ స్పైస్ పార్క్‌కు రూ. 20 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటూ…దానికి ఆదేశాలు త్వరగా ఇవ్వాలని ప్రతిపాదించారు.
కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ – వరంగల్ , హైదరాబాద్ – రామగుండం, హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లకు మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణకు మెగా లెదర్ పార్క్ కేటాయించాలని కోరినట్లు మంత్రి వివరించారు. ఫిబ్రవరి 22, 23న హైదరాబాద్ లో నిర్వహించే బయో ఆసియ సదస్సు కు రావాలని మంత్రి సురేష్ ప్రభుని ఆహ్వానించామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. టీఎస్‌ఐపాస్‌కు వస్తున్న సానుకూల స్పందనను సురేశ్‌ప్రభుకు తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు.