తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ గల్లంతు కాబోతోంది. అధికార టీఆర్ఎస్‌లోనికి జంప్ అయ్యేందుకు ఆ మాజీ మంత్రి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం.అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మంత్రి మండవ వెంకటేశ్వరరావును అధికార టీఆర్ఎస్ పార్టీ లోకి తీసుకువచ్చే బాధ్యతను తీసుకున్నారని సమాచారం .మండవ గతంలో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా ఆవిర్భవించింది.కొన్ని రోజులుగా టీడీపీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న.. ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు సుముఖంగా లేరన్న ప్రచారం కూడా జోరుగాసాగింది . అదే సందర్భంలో నిజామాబాద్ జిల్లాలోనే ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల విషయంలో కూడా కొంత చర్చ జరుగుతోంది.మండవ చేరిక ద్వారా పాత నిజామాబాద్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి లాభిస్తుందని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం కేటాయించాలా? లేక ఇతరత్రా అవకాశం కల్పించాలా అన్న విషయంపైనే చర్చ జరుగుతోందని సమాచారం.
