ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అరవై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర నిర్వహిస్తున్నారు .జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీ ,సీ ఓటర్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి .
ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు వస్తే ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి అనే అంశం మీద సర్వే నిర్వహించాయి .ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ,ఇటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమికి పన్నెండు స్థానాలు ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి పదమూడు స్థానాలు వస్తాయి అని తేలింది .అయితే గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చిస్తే టీడీపీ ,బీజేపీ కూటమికి ఐదు సీట్లను కోల్పోగా వైసీపీ పార్టీకి గతంతో పోలిస్తే ఐదు స్థానాలు పెరుగుతాయి అని రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో తేలింది అని ఆ ఛానల్ ప్రకటించింది.
అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ పార్టీ కురిపించిన ఎన్నికల హామీలను నేరవేర్చకపోవడమే కాకుండా రాష్ట్రానికి ఇస్తాను అని చెప్పిన ప్రత్యేక హోదాను ,ప్రత్యేక రైల్వే జోన్ లాంటి హామీలను తుంగలో తోక్కడం ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు .రానున్న కాలంలో ఈ వ్యతిరేకత ఎక్కువై అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని రిపబ్లిక్ టీవీ ప్రకటించింది .ప్రస్తుతం పాదయాత్రలో వస్తున్న ఆదరణకు మంచి జోష్ లో ఉన్న వైసీపీ శ్రేణులకు ఈ సర్వే మంచి బూస్టింగ్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ..