ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పరిశీలించారు.పర్యటనలో భాగంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనక పెద్ద టీమ్ వర్క్ వుంది..కాళేశ్వరం ప్రాజెక్ట్ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని కొనియాడారు. సమయం ప్రకారం పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్యాకేజీ -6లో గోదావరిని అంతర్‌వాహిణిగా తీసుకొచ్చారని గవర్నర్ తెలిపారు. ప్రాజెక్ట్ పనుల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ గవర్నర్ అభినందనలు తెలియజేశారు.
‘ఇప్పటి వరకు మ్యాపుల ద్వారానే కాళేశ్వం ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నా. క్షేత్రస్థాయి పరిశీలనలో పనులు జరుగుతున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ – జులై వరకు తొలి దశ పనులు పూర్తవుతాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఈ సందర్బంగా అభినందనలు అని అన్నారు . గవర్నర్ వెంట మంత్రి హరీశ్ రావు, ఉన్నతాధికారులు ఉన్నారు.