దావొస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు స్విజర్లాండ్ చేరుకున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు జ్యూరిచ్ (Zurich) విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.విమానాశ్రయములో ప్రవాస భారతీయులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం నేతలు మంత్రి కేటీ రామారావు పూలగుచ్చాలతో స్వాగతం పలికారు. ఐదురోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఈ రోజు జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. రేపు ఒకరోజు జ్యూరిచ్ నగరంలో పలు సమావేశాలను నిర్వహించుకొని మంత్రి బృందం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశానికి బయలుదేరుతుంది. మంత్రి కేటీ రామారావు వర్ల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి అందిన ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరవుంటున్నారు. మంత్రి 22 నుంచి 26 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవ్వడంతోపాటు, పలు సమావేశాల్లో ప్రసంగిస్తారు. ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు మహేష్ బిగాల గుప్త, అనిల్ కూర్మాచలం, అశోక్, నవీన్, తెలంగాణ జాగృతి యూకే ప్రతినిధి స్పందన తదితరులు మంత్రికి స్వాగతం పలికారు.
