ట్విట్టర్ ద్వారా ఎవరైనా ఆపదలో ఉన్నట్లు తెలిస్తే వెంటనే స్పందించి వారికి తగిన సహాయాన్నిఅందిస్తూ ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ఎన్నోసార్లు సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన అభాగ్యుల ప్రాణాలను కాపాడి తన మానత్వాన్ని చాటుకున్నారు. తాజాగా ఆపదలో ఉన్నామని, ఆదుకోవాలని ఓ చిన్నారి తండ్రి చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.
వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన అడెపు శ్రీధర్ కూతురు అడెపు వర్నిక వింత వ్యాధితో బాధపడుతూ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నది. నిరుపేద కుటుంబం కావడంతో శ్రీధర్ తన స్నేహితుల వద్ద ఆర్థిక స్థితిగతుల గురించి వివరించారు. వారి సలహాతో మంత్రి కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా వర్నిక ఆరోగ్య పరిస్థితిని వివరించారు.విదేశీపర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి తన సిరిసిల్లలోని తన కార్యాలయంలో సంప్రదించాలని రీ ట్వీట్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వర్నిక గురించి ట్వీట్ చేసి చిన్నారికి సహకారం అందించాలనీ అధికారులకు మంత్రి సమాచారం అందించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వార రూ.1.50 లక్షలను మంజూరు చేశారు. ట్వీటర్‌కు స్పందించి తన కుతూరి ఆరోగ్య వైద్య ఖర్చులకు సహకరించిన మంత్రి కేటీఆర్‌కు వర్నిక తండ్రి శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గౌరవనీయులు ktr సార్ కి
మా పాప వర్ణిక కు వైద్యానికి సహాయం అందించి మా పాపకు కొత్త జీవితన్ని ప్రసాదించిన మా దేవుడికి ధన్యవాదాలు@KTRTRS pic.twitter.com/qPb32OFfeA— Sridharadepu (@Sridharadepu6) January 21, 2018
You're most welcome brother. Glad your baby is doing better?
But request you to stop making Gods out of mere human beings. We are just doing our duty as elected public representatives https://t.co/YJLGG4VTqL
— KTR (@KTRTRS) January 21, 2018